నెల రోజుల్లో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం :రామ్మోహన్ నాయుడు
నెల రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలిపారు. ఉడాన్ 2.0 పథకం అమలు తీరుతెన్నులపై వర్క్ షాప్ లో పాల్గొన్న అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణపనులు పూర్తయ్యాయని, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రధాని మోదీ (Prime Minister Modi) చేతుల మీదుగా ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. తేదీ ఖరారైన వెంటనే నెల రోజుల్లో విమాన కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఉడాన్ పథకాన్ని (UDAN scheme) మరో పదేళ్ల పాటు పొడిగించనున్నామని, దీనికోసం కేంద్రం రూ.29 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. కనెక్టివిటీని మెరుగుపరచడంలో భాగంగా ఉడాన్ 2.0లో కొన్ని మార్పులు చేశామని చెప్పారు.








