Murali Mohan :ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి : సినీ నటుడు మురళీమోహన్
ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని, అప్పుడే కోట్ల మంది ఆయన అభిమానులు, తెలుగువారు సంతోషిస్తారని సినీ నటుడు మురళీమోహన్ (Murali Mohan) అన్నారు. జై ఎన్టీఆర్ టీమ్, సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్(Singapore) లోని ఆర్యసమాజ్ ఆడిటోరియంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా మురళీమోహన్ (Murali Mohan), ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ(Nandamuri Ramakrishna) , ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ (TD Janardhan) హాజరయ్యారు. ఈ సందర్బంగా గుండెల్లో గుడికట్టినావయ్య పాటను ఆవిష్కరించారు. అనంతరం తారకరామం పుస్తకాన్ని ముఖ్య అతిథులు ప్రదర్శించారు. తర్వాత నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి నుంచి క్రమశిక్షణ, సభ్యత, సంస్కారం వంటి విలువల్ని పుణికి పుచ్చుకున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ మీద మరిన్ని పుస్తకాలు తెస్తామని, హైదరాబాద్లో వంద అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని టీడీ జనార్దన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేశ్, కురిచేటి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.













