మోదీపై బాలకృష్ణ విమర్శలు
విజయవాడలో జరుగుతున్న ముఖ్యమంత్రి దీక్షలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకష్ణ పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం వ్యవహరిస్తోన్న తీరును ఆయన ఎండగట్టారు. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదంటూ ఆయన కమలం పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ఏపీకి ప్రయోజనం చేకూర్చడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని బాలయ్య చెప్పారు. నాలుగేళ్లుగా సామ దాన బేధోపాయాలను ప్రయోగించాం. ఇక మిగిలింది దండోపాయమే అంటూ బాలక ష? తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కాదంటూ.. తీవ్రంగా మండిపడిన ఆయన హిందీలోనూ ప్రసంగించారు.













