విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ సిద్ధం కానీ .. ఏపీ ప్రభుత్వమే
విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పటికే అడిగామని, అయితే ప్రభుత్వం ఇంకా అప్పగించలేదని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోన్ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధమైందని, భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి రూ.886 కోట్ల నిధులు ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్లో ఒక ఏపీకే రూ.9,138 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆంధ్రాలో ఏడాదికి 240 కి.మీ మేర నూతన ట్రాక్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. 98 శాతం లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయన్నారు.













