Posani: పోసాని బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తి
గుంటూరు సీఐడీ కోర్టులో వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali ) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును ఈ నెల 21కి వాయిదా వేసింది. చంద్రబాబు (Chandrababu)పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , లోకేశ్ (Lokesh) తదితరులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ప్రదర్శించిన పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గతేడాది అక్టోబరు 9న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ (CID) పోలీసులు ఆయన్ను గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు విచారించారు. డీఎస్పీ లక్ష్మయ్య తదితరులు 32 ప్రశ్నలు అడగ్గా కొన్నింటికి స్పష్టమైన సమాధానాలిచ్చిన పోసాని, మరికొన్ని ప్రశ్నలకు తెలియని, గుర్తు లేదని మొక్కుబడిగా స్పందించారని సమాచారం.













