ఈ నెల 13 నుంచి 16 వరకు డాక్టర్ వేమూరి రవి గల్ఫ్ దేశాల్లో పర్యటన
ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు (ఏపీఎన్ఆర్టీ) అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వేమూరి రవి ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారని అసోసియేషన్ తెలిపింది. ఈ సందర్భంగా ఆయన గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలుగు వారితో ప్రత్యేకించి సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రవాస భారతీయుల సంక్షేమం, అభివృద్ధి పాలసీకి సంబంధించి కూడా ఆయన అక్కడి ప్రవాస భారతీయులతో సుదీర్ఘంగా చర్చిస్తారు. ఈ పాలసీ వల్ల కలిగే లాభ, నష్టాలపై రవి ప్రవాస భారతీయులతో కూలంకషంగా చర్చించి, ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించేందుకు కృషి చేస్తారని తెలిపింది. ఈ సందర్భంగా ఆయన అవసరమైతే అక్కడి ప్రవాస భారతీయులతో వారి సంక్షేమానికి సంబంధించి కొన్ని ఒప్పందాలను కూడా చేసుకునే అవకాశం ఉందని అసోసియేషన్ పేర్కొన్నది. ఎన్ఆర్టి రాష్ట్ర అభివృద్ధిలో అన్ని విధాలా భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుందని అసోసియేషన్ సృష్టం చేసింది.













