30న ఏపీ సెక్రటేరియట్ కు శంకుస్థాపన ?
సమున్నత ఆకాశహర్మ్వాలతో రాజధాని మకుటాయమానంగా నిలుస్తుందని ఆశిస్తున్న సచివాలయ సముదాయ నిర్మాణంలో ఈ నెల 30న మరొక కీలక అడుగు పడనుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. 2వ టవర్ ఫౌండేషన్ తాపీతో సిమెంట్ కాంక్రీట్ వేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు ప్రతిష్టాత్మక టవర్లకు లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేయనున్నారని సమాచారం. సుమారు 70 లక్షల చ.అ.విస్తీర్ణంతో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయం (విస్తీర్ణం 6 లక్షల చ.అ.) ంటే దాదాపు 12 రెట్లు పెద్దవిగా ఈ టవర్లు రూపుదిద్దుకోనున్నాయి. ఈ టవర్లన్నీ భూ ఉపరితంలో పాటు స్కైవేల ద్వారా కూడా పరస్పరం అనుసంధానమైన ఉంటాయి. వీటికి సంబంధించిన మట్టి పనులు దాదాపుగా పూర్తయ్యాయి.













