ఏపీలో కొత్తగా 12,768 కరోనా కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 98,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12,768 మంది కరోనా బారిన పడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో 98 మంది మృతి చెందారు. కరోనా నుంచి 15,612 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,62,229లకు చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా మొత్తం 11,132 మంది కన్నుమూశారు. ఇప్పటివరకూ 17,17,156 మంది కరోనా బారిన పడగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,795 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,94,48,056 కరోనా పరీక్షలు నిర్వహించారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాల్లో 15 మంది మృతి చెందారు. నెల్లూరులో 10 మంది, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మంది మరణించారు. అనంతపురం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో 8 మంది చొప్పున మరణించారు. గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో 7 చొప్పున మృతి చెందారు. విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణాలో 5 మంది, కర్నూలులో నలుగురు మృత్యువాతపడ్డారు.