Nara Lokesh : రాజకీయాల్లో మార్పు రావాలంటే.. యువత రాజకీయాల్లోకి : మంత్రి లోకేశ్
కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో గొప్ప సంస్కరణలను తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులోని గంగవరం రహదారిలోని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao) నిర్మించిన డీవీఆర్ సైనిక స్కూల్ (DVR Sainik School )ను మంత్రి ప్రారంభించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థులు దేశభక్తిని అలవరుచుకోవాలని సూచించారు. ఏపీకి పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు(Chandrababu) పెట్టుబడులు తీసుకువస్తున్నారు. రాబోయే కాలంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. అన్ని రంగాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంచేందుకు సీఎం చంద్రబాబు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు.
విలువలతో కూడిన విద్యను అందించడం కోసమే ఈ సైనిక స్కూల్‌ను ప్రారంభించినట్లు ఎంపీ పురందేశ్వరి (MP Purandeshwari) తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు సాంబశివరావు, ఎంఎం కొండయ్య యాదవ్, నరేంద్ర వర్మ పాల్గొన్నారు.













