ఈ సారి కూడా.. తేనీటి విందు రద్దు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాజ్భవన్లో నిర్వహించే తేనీటి విందును ఈసారి కూడా నిర్వహించరాదని ఆంధప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్ నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని గవర్నర్ రద్దు చేశారు. ఆగస్టు 15న ప్రతీయేటా రాజ్ భవన్లో తేనీటి విందు నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులు తదితరులను ఆహ్వానిస్తుంటారు. కరోనా నుంచి రక్షణకు ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. గవర్నర్ నిర్ణయం, సందేశాన్ని ఆయన కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.













