సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంపై కేంద్రం కుట్రలను ఢిల్లీ వేదికగా విన్పించేందుకు ఆయన హస్తినకు పయనంకానున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి, ఆపరేషన్ గరుడ తదితర అంశాలను ముఖ్యమంత్రి దేశ ప్రజల ముందుకు ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కాన్స్టిట్యూటషన్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపడం, తిత్లీ తుఫానుపై స్పందించకపోవడం, విభజన చట్టం పెండింగ్ అంశాలపై ఢిల్లీ వేదిక నుంచి ఆయన కేంద్రాన్ని నిలదీయనున్నారు. మరోవైపు గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది.













