అక్టోబర్ 17న అమెరికాకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నెల 17న అమెరికా వెళ్లనున్నారు. అయోవా రాష్ట్రంలో అక్టోబరు 18, 19 తేదీల్లో జరిగే ప్రపంచ ఆహార పురస్కార వేడుకల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఆహార రంగంలో నోబెల్‌గా భావించే ఈ పురస్కారాన్ని ఈ సారి నైజీరియాకు చెందిన ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు అధ్యక్షుడు అయోదెజీ అదెసినాకు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా వారంపాటు జరిగే కార్యక్రమాలకు 50 దేశాల నుంచి వెయ్యి మంది వరకు ప్రతినిధులు హాజరవుతారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందింది.













