18 నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి ఐదు రోజులపాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మాల్దీవులకు పర్యటిస్తారని సమాచారం. సీఎంతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మాణి, మనవడు దేనాన్ష్ వెళ్తున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ మంత్రి లోకేశ్ నేరుగా మాల్దీవులు వెళ్లి వారితో కలుస్తారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన కారణంగా గడ్కరీ పోలవరం రాక 23కి వాయిదా పడింది. 27వ తేదీన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విశాఖకు వస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఆ రోజు అక్కడకు వెళ్తారు.











































































