ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. సీఎం పేషీ, సీఎంలో అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం. మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టులకు ఆమోదం. కొత్తగా ఏర్పాటు చేయబోయే రేషన్ దుకాణాల్లో ఈ`పాస్ మిషన్ల కొనుగోలుకు రూ.11.51 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ( ఎస్ఈబీ) రద్దుకు ఆమోదం తెలిపింది. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో, రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు ఆమోదం. 21.86 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నం. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పనుల్లో ప్రస్తుత గుత్తేదారు సంస్థనే కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాదాల్లోని భూమలు రిజిస్ట్రేషన్ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.













