చేనేత కుటుంబాలకు శుభవార్త
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో కొత్త సంక్షేమ పథకాలకు విధివిధానాలపై ఈ భేటీలో చర్చించారు. చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక సాయంపై ప్రధానంగా చర్చించారు. వైఎస్ఆర్ చేనేత నేస్తం పేరుతో ఏటా రూ.24 వేలు చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు రూ.216 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఏటా డిసెంబర్ 21న చేనేత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకు ద్వారా అందించనున్నారు. ఒకే విడతలో రూ.24వేలు సాయం చేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 90వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.













