Vajpayee: విజయవాడలో వాజ్ పేయీ విజ్ఞాన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలోని ప్రసిద్ధ రామ్మోహన్ గ్రంథాలయంలో వాజ్పేయీ విజ్ఞాన కేంద్రం (Vajpayee Knowledge Center) ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ (Buddha Prasad), విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి (Sujana Chowdhury) ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ఈ గ్రంథాలయం కొన్నాళ్లుగా వైభవాన్ని కోల్పోయిందని, మళ్లీ నిర్వాహకులు పూర్వ వైభవం తేవడం అభినందనీయమని తెలిపారు. రాజకీయాలకు ఔన్నత్యం తెచ్చిన గొప్ప నాయకుడు వాజ్ పేయీ, ఆయన పేరును ఈ విజ్ఞాన కేంద్రానికి పెట్టడం మంచి పరిణామమని అన్నారు. సుజనా చౌదరి మాట్లాడుతూ 117 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రంథాలయానికి పూర్వవైభవం తేవడం గొప్ప విషయమన్నారు. విజయవాడ తన జన్మభూమి అని, హైదరాబాద్ వెళ్లినా, అమెరికా(America) వెళ్లినా అవన్నీ కర్మభూములేనని అన్నారు. ఈ గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తామని సుజనా హామీ ఇచ్చారు.













