ఏపీలో కరోనా విజృంభణ… 72 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,10,147 మందికీ పరీక్షలు నిర్వహించగా.. 21,954 కేసులు పాజిటివ్‍గా నిర్థారణ అయ్యాయి. 72 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,353 మంది కొవిడ్ సెంటర్‍లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 12,28,186 మంది వైరస్ బారినపడగా, మొత్తం 1,70,60,446 నమూనాలను ఆరోగ్యశాఖ పరీక్షించింది. 24 గంటల వ్యవధిలో 10,141 మంది బాధితులు కోలుకోవడంతో వారి సంఖ్య 10,37,411కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,82,329 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో కొవిడ్‍తో విశాఖలో అత్యధికంగా 11 మంది, తూర్పుగోదావరి 9, విజయనగరం 9, ప్రకాశం 6, అనంతపురం 8, చిత్తూరు 5, కర్నూలు 4, కృష్ణా 4, గుంటూరు 5, శ్రీకాకుళం 4, నెల్లూరు ఇద్దరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8,446కి చేరింది. 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 3,531, కృష్ణాలో అత్యల్పంగా 548 మంది కరోనా బారిన పడ్డారు. 12 జిల్లాల్లో వెయ్యికి పైగా బాధితులు వైరస్ బారినపడ్డారు.