ఏపీకీ చేరుకున్న 2 లక్షల కోవిషీల్డ్ టీకాలు

ఏపీలోని గన్నవరం విమానాశ్రయానికి 2 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు ఈ వ్యాక్సిన్‌ను తరలించారు. ఈ టీకా కేంద్రం నుంచి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వ్యాక్సిన్ డోసులు వివిధ జిల్లాలకు తరలి వెళ్లనున్నాయి.