ఏపీలో 21వేలకు పైగా కేసులు.. 89 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 90,750 శాంపిల్స్ పరీక్షించగా 21,452 మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,44,386 మంది వైరస్ బారినపడగా, మొత్తం 1,76,05,687 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. 24 గంటల్లో 19,095 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, మొత్తం 11,38,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,927 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 693 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్‍తో విశాఖలో 11 మంది, తూర్పుగోదావరి 9, కృష్ణా 9, చిత్తూరు 8, విజయనగరం 9, నెల్లూరు 8, గుంటూరు 8, శ్రీకాకుళం 7, కర్నూలు 5, అనంతపురం 6, ప్రకాశం 4, కడపలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కొవిడ్‍తో 89 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 8,998కి చేరింది.