వ్యాక్సినేషన్ లో రికార్డును బద్దలు కొట్టిన జగన్ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో రికార్డు సృష్టించింది. ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాక్సినేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, రాష్ట్రానికి అవసరమై వ్యాక్సిన్ డోసుల విషయంలో ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటున్నారు. కింది స్థాయిలో వ్యాక్సినేషన్ కచ్చితంగా అమలయ్యేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ‘మాస్ వ్యాక్సినేషన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా కొత్త రికార్డులను సృష్టించింది జగన్ సర్కార్. ఒక్కరోజే 11.85 లక్షల మందికి టీకాలు ఇచ్చామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ సుమారు 96 లక్షల మందికి మొదటి డోసు ఇచ్చామని రాష్ట్ర వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో ఈ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1.50 లక్సల మందికి పైగా వ్యాక్సినేషన్ వేశారు. ఒకే రోజు ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని సంకల్పించింది. ఈ సంఖ్యను ఏపీ సర్కార్ అధిగమించింది.