ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్నిమాపక విభాగం డైరెక్టర్ జనరల్‌గా ఏఆర్ అనూరాధ నియమితులయ్యారు. విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్‌గా రాజీవ్‌కుమార్ మీనా, గుంటూరు రేంజి ఐజీగా వినీత్ బ్రిజ్‌లాల్, విశాఖపట్నం రేంజి డీఐజీగా లేళ్ల కాళిదాస్ వెంకట రంగారావులకు పోస్టింగులు లభించాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ నెల 5న 26 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. గత బదిలీల్లో పోస్టింగ్ పొందిన డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ఎస్పీ డా.కోయ ప్రవీణ్‌లను తాజాగా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు.













