ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ఐదేళ్లలోపు చిన్నారుల

వ్యాక్సినేషన్ విషయంలో ఆంధప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‍కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. చిన్నారులపై థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల వారీగా జాబితా సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన తల్లులందరికీ ఒకరోజు ముందుగానే టోకెన్లు పంపిణీ చేయాలని పేర్కొంది. టోకన్లలో ఉన్న తేదీ, సమయం ప్రకారం ఏఎన్‍ఎంలు, ఆశావర్కర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలించి వ్యాక్సిన్ వేయించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. 5 ఏళ్ల లోపు చిన్నారులతో పాటు ఉన్న తల్లులకి వ్యాక్సిన్ వేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది. అర్హులైన తల్లులు 15 నుంచి 20 లక్షల మంది ఉంటారని అంచనా వేసింది.