ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ఢల్లీి పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో గవర్నర్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయినట్లు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ నెల 15న వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఏఐజీ వైద్యులు వెల్లడిరచారు.