రూ.2.24 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
ఆంధప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో వరుసగా రెండోసారి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందున్నామని, లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామని తెలిపారు. అట్టడుగున ఉన్న పేదల ప్రజలను ఆర్థికసాయం ద్వారా పైకితీసుకు రావాలని, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చాలని సీఎం తీసుకున్న నిర్ణయాలు సవాళ్లుగా మారాయని వివరించారు. గతం ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని ఖర్చు చేసే విధానాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని సృష్టం చేశారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా
బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789.18 కోట్లు
రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు
వ్యవసాయానికి రూ.11,891 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా రూ.3,615 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు
వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు
విద్యకు రూ.22.604 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి రూ.1998 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు
వైద్య రంగానికి రూ.11,419 కోట్లు
ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు
వైఎస్ఆర్ గృహ వసతికి రూ.3వేల కోట్లు
పీఎం ఆవాస్ యోజన (అర్బన్) రూ.2,540 కోట్లు
పీఎం ఆవస్‌యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు
బలహీన వర్గాల గృహనిర్మాణానికి రూ.150 కోట్లు
రేషన్ బియ్యానికి రూ.3 వేల కోట్లు
డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు
రూ.8 వేల కోట్లతో 30 లక్షల ఇళ్ల పట్టాలు
అభివృద్ధి పథకాలకు రూ.84,140.97 కోట్లు
షెడ్యూల్డు కులాల అభివృద్ధికి రూ.15,735.68 కోట్లు
షెడ్యూల్డు తెగలకు రూ.5,177.53 కోట్లు
బీసీల అభివృద్ధికి రూ.25,331.30 కోట్లు. బీసీ కులాలకు గతంతో పోలిస్తే 68.18 శాతం అధికం
మైనార్టీల అభివృద్ధికి రూ.2050.22 కోట్లు. మైనార్టీలకు గతేడాదితో పోలిస్తే 116.10 శాతం అధికం.
జగనన్న చేదోడు పథకానికి 247 కోట్లు కేటాయించారు.
Click here Budget Speech Telugu













