Posani: సీఐడీ కస్టడీకి పోసాని కృష్ణమురళి
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) కి కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సీఐడీ (CID) కస్టడీకి తీసుకొని ప్రశ్నించనుంది. మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలు (Guntur Jail ) లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు మంగళవారం పోసాని బెయిల్ (Bail) పిటిషన్పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది.













