వైఎస్ జగన్కు సీబీఐ షాక్
అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ న్యాయస్థానం సృష్టం చేసింది. నాంపల్లిలోని న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. ఇవాళ హాజరు నుంచి జగన్, విజయసాయి రెడ్డి మినహాయింపు కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పదేపదే మినహాయింపు కోరడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఏ1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందేనని జగన్ తరపు న్యాయవాదికి సీబీఐ కోర్టు సృష్టం చేసింది. ఈ నెల 10న విచారణకు హాజరై తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. నేరానికి, హోదాకు సంబంధం లేదని న్యాయస్థానం పేర్కొంది.













