బాధితులకు అండగా ఉంటాం : మంత్రి లోకేశ్
పరవాడ ఫార్మాసిటీ (Paravada Pharmacity)లో అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు (workers) మృతి (Death)చెందడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.








