కొరియా రాయబారి లీ సియోంగ్ హో తో మంత్రి లోకేష్ భేటీ
న్యూఢిల్లీ: భారత్ లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) రాయబారి లీ సియోంగ్ హో (Mr. Lee Seong-ho)ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో కొరియన్ కంపెనీల విస్తరణ, భవిష్యత్తులో ఇరుదేశాల నడుమ మరింత సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. సెమీకండక్టర్లు, మైక్రో ఎలక్ట్రానిక్స్, స్టోరేజ్, నౌకా నిర్మాణం, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో కొరియా ప్రపంచ అగ్రగామిగా ఉంది. భారతదేశంలో కొరియన్ కంపెనీలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా దీర్ఘకాలిక భాగస్వామిగా నిలవగలదనే అంశంపై మంత్రి లోకేష్ చర్చించారు.








