లక్నో కోచింగ్ సెంటర్ లో తీవ్ర అగ్ని ప్రమాదం.. 15 మంది మృతి
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఒక మూడంతస్తుల భవనంలో నడుస్తున్న ప్రముఖ కోచింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద సమయంలో భవనంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకుని ఊపిరాడక లోపల ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు 15మంది చనిపోయారని సమాచారం.
అయితే. యానిమేషన్ కోచింగ్ సెంటర్లో ఉన్న పిల్లలు టాయిలెట్లో దాక్కొని తమ ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నించారు. కొంతమంది డ్రైనేజీ పైపులను పట్టుకొని దిగడానికి ప్రయత్నం చేశారు. తమ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమను ఎలాగైనా కాపాడాలని గుండలవిసేలా రోదించారు. కింది అతస్తుల్లో ఉన్నవారిలో కొందరు ప్రాణాలను కాపాడుకోవడం భవనం నుంచి దూకిన వీడియోలు వైరల్ అయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న జంతువుల దుకాణంలో ఉన్న పలు జంతువులు, పక్షులు మంటల్లో కాలిపోయాయి. 14అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను ఆర్పివేశాయి. అయితే, అప్పటికే భవనం అంతా కాలిపోయింది.
అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ చెప్పారు. అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారికి రూ.50వేలు ఇస్తామన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన అలీగఢ్ పర్యటనను రద్దు చేసుకుని లఖ్నవూ చేరుకున్నారు.








