కర్నాటకలో ‘‘క్రాస్ ఓటింగ్’’.. బీజేపీకి భారీ ఝలక్
దేశమంతా అజేయంగా దూసుకెళ్తున్న బీజేపీ, కర్నాటకలో ఒక్కసారిగా చతికిలపడింది. చతికిలపడటమే కాదు, ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంతో ఏడు స్థానాలకు గాను, ఐదింటిని కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే.. దీని వెనుక బీజేపీ శాసన సభ్యుల క్రాస్ ఓటింగ్ అని తేలింది.
కాంగ్రెస్ సాధించిన ఈ భారీ విజయం, కనీసం ఆరుగురు బీజేపీ శాసనసభ్యులు మరియు నలుగురి నుంచి ఎనిమిది మంది జేడీ(ఎస్) శాసనసభ్యులు వేసిన క్రాస్ ఓటింగ్ వల్లే సాధ్యమైంది.ఈ పరిణామం బీజేపీ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది; క్రాస్-వోటింగ్ ఎలా జరిగిందో తెలుసుకునేందుకు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్రను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అడిగి తెలుసుకున్నారు వెంటనే.
అసలు వారిని క్రాస్ ఓటింగ్ చేసేలా ప్రోత్సహించింది ఎవరు అన్న దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. దీని వెనుక కచ్చితంగా సీఎం డీకే శివకుమార్ వున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి కూడా ఇలాంటి రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగానే వుంటారని బీజేపీ పేర్కొంటోంది.
అది బసవరాజ్ కావచ్చు, చంద్రు లమాని కావచ్చు లేదా కృష్ణ నాయక్ కావచ్చు. ఇలా రకరకాల పేర్లను తెరపైకి తీసుకురావడం ద్వారా, బీజేపీలో అంతర్గత కలహాలను రేకెత్తించి గందరగోళం సృష్టించడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు,” అని కూడా బీజేపీ పేర్కొంటోంది.
తన పార్టీకి చెందిన సభ్యులతో పాటు JD(S) సభ్యులు కూడా క్రాస్-వోటింగ్ చేశారని విజయేంద్ర అంగీకరించారు. “క్రాస్-వోటింగ్ చేసిన మా పార్టీ ఎమ్మెల్యేలను క్షమించే ప్రసక్తే లేదు. వారిని క్షమించబోము. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉందనే దానిపై మాకు కొంత సమాచారం కూడా ఉంది,” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ప్రకటించారు.








