టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని మసూరీలో అనుమానాస్పదరీతిలో మృతిచెందిన టెకీ రాధా గాయత్రి (Radha Gayatri) కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణాధికారిని అక్కడి డీజీపీ దీపమ్‌సేథ్ ( Deepam Seth) మార్పు చేశారు. మసూరీ ఎస్‌హెచ్‌వో దేవేంద్ర చౌహాన్ ప్రవర్తనపై మృతురాలి తండ్రి సుధాకర్ (Sudhakar) డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఎస్‌హెచ్‌వోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ నుంచి తప్పించారు. అనంతరం ఆ బాధ్యతను సంపూర్ణానంద్ గైరోలాకు అప్పగించారు. అల్లుడు శ్రీచరణ్‌పై అనుమానాలతో సుధాకర్ మసూరీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో శ్రీచరణ్ (Sricharan)పై హత్య కేసు నమోదైంది.








