నేడు విశాఖలో ధర్మపోరాట దీక్ష
విశాఖపట్నంలో ధర్మపోరాట దీక్షకు తెలుగుదేశం పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌తోపాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాట దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. తొలుత గత నెల 30న తిరుపతిలో చేపట్టిన దీక్షకు అనూహ్యమైన ప్రజాదరణ లభించడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లోనూ దీక్షలు నిర్వహించి, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు విశాఖపట్నంలో నేడు ధర్మపోరట దీక్ష చేయనుంది. ఇందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కశాశాల మైదానాన్ని వేదికగా ఎంపిక చేశారు. సుమారు లక్ష నుంచి 1.25 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 150 మంది కూర్చొనే విధంగా వేదికను రూపొందించారు. ముఖ్యమంత్రితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల ప్రతినిధులకు వేదికపై అవకాశం కల్పిస్తారు.













