భీమిలి బరిలో కేంద్ర మాజీ మంత్రి కుమార్తె ?
విజయనగరం రాజుల కుటుంబ నుంచి మరొకరు తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు కుమార్తె అదిత విశాఖ జిల్లా భీమిలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు.. విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని, భీమిలి నుంచి అదితి పేరును అధిష్టానం పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతోంది. భీమిలి నుంచి గతంలో అశోక్ గజపతిరాజు తండ్రి పీవీకే రాజు, ఆయన సోదరుడు ఆనందగజపతిరాజు పోటీ చేసి విజయం సాధించారు. భీమిలి ప్రాంతంలో పూసపాటి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి.













