ప్రవాసాంధ్రులను బెదిరించిన వైసీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలి : జయరాం కోమటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తమవంతు బాధ్యతగా అనేక కార్యక్రమాలు చేస్తున్న ప్రవాసాంధ్రులను వేమూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వరికూటి అశోక్‌బాబు బెదిరించడం దారుణమంటూ ప్రవాసాంధ్రుడు, టీడీపీ ఎన్నారై అమెరికా కో ఆర్డినేటర్ జయరాం కోమటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చి ఏదైనా చేస్తే, తిరిగి విదేశాలకు వెళ్లలేరు అంటూ బెదిరించిన అశోక్‌బాబుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని అన్నివిధాలా సాయం చేస్తున్న ఎన్నారైలను వైసీపీ తీవ్రంగా అవమానపరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.













