టీడీఎల్పీ నేతగా అచ్చెన్నాయుడు?
తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేతగా మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పేరు దాదాపుగా ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం. బుధవారం టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభ పక్షనేతను ఎన్నుకోనున్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ బాధ్యతలను స్వీకరించే ఆలోచనలో లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలను మంచి వాగ్ధాటి కలిగిన నేతగా పేరున్న అచ్చెన్నాయుడుకు అప్పగించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్వర్గీయ కింజరపు ఎర్రన్నాయుడు కుటుంబం నుంచి ముగ్గురు చట్టసభలకు ఎన్నిక అవడం విశేషం.













