రానున్న ఎన్నికల్లో పులివెందుల సహా.. అన్ని స్థానాల్లో టీడీపీ
నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ వారిపైనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దాడి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో దళిత సమ్మేళేన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు చెందిన పథకాలన్నీ జగన్ రద్దు చేశారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడమే జగన్ పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి వస్తుంటే అనేక మంది స్వాగతం పలికారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన రాత్రింబవళ్లు కష్టపడ్డారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకలో కూడా అవినీతి జరిగిందని కేసు పెట్టారు. రాష్ట్రానికి జగన్ తీరని నష్టం చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారు. రానున్న ఎన్నికల్లో పులివెందుల సహా అన్ని స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయం అని అన్నారు.













