సైకో పాలనలో దేవుడిని చూసే భాగ్యం కూడా లేదా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేతల గృహ నిర్బంధాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సైకో రెడ్డి పాలనలో దేవుడిని చూసే భాగ్యం కూడా లేదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేమని గుర్తుంచుకో అని అన్నారు. జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన చంద్రబాబుపై జగన్ అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. వారు ఏం తప్పు చేశారని గృహ నిర్బంధాలు చేస్తున్నారని అన్నారు. దేవుడికి బాధలు చెప్పే స్వేచ్చ కూడా జగన్ పాలనలో లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్టు జరిగినప్పటి నుంచి టీడీపీ నేతలను గృహనిర్భంధం చేస్తునే ఉన్నారు. మీ అరాచకాలు బయటపడతాయని భయమా? మా వాళ్లు చేసిన తప్పేంటి? ఎక్కడైనా విధ్వంసాలకు, చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డారా? పోలీసులు చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారు. హద్దులు దాటి అణచివేతకు గురి చేస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి పైశాచికానందం పొందుతున్న వైసీపీ నేతల మాటల్ని పోలీసులు వినొద్దు. చంద్రబాబు కోసం అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందగా రోడ్లపైకి వస్తుంటే వారిని అడ్డుకోవడం దేనికి సంకేతం? ఎన్నికలు దగ్గర పడుతున్నా, రాజారెడ్డి రాజ్యాంగాన్నే అమలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం అని అన్నారు.













