ఏపీలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఈ ఘటనే….

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెసరవాయిలో టీడీపీ నేతలు వడ్డి నాగేశ్వర్‍రెడ్డి, ప్రతాపరెడ్డిని దారుణంగా హతమార్చారని అన్నారు. ఈ ఘటన వెనుక వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తముందని ఆయన ఆరోపించారు. రాజకీయ కక్షతో టీడీపీ నేతలను బలిగొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు దారుణాలకు తెగబడుతున్నా పోలీసులు చోద్యం చూడటం హేయమని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని వ్యాఖ్యానించారు. హత్య ఘటనకు పోలీసులు, ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.