ప్రభుత్వ తీరు మారకపోతే.. ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్ గాలికొదిలేశారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా తమపై నిందలు వేయడమేంటని ప్రశ్నించారు. జగన్ రెడ్డి అసమర్థ పాలనతో ప్రకారం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఊడి నీరు వృథాగా పోతోందని దుయ్యబట్టారు. టీఎంసీ, క్యూసెక్కు ఈ రెండిరటికీ తేడా తెలియని వారికి నీటిపారుదల శాఖ కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరు మారకపోతే ప్రాజెక్టుల దగ్గర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.













