160 స్థానాలు కాదు… ఆ పార్టీ నుంచి ఒక్కరూ గెలవరు
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలో లేని, వేయని ఇన్నర్ రింగ్‌రోడ్డులో అవినీతి ఎలా జరిగింది? అనే పుస్తకాన్ని పార్టీ నేతలతో కలిసి అచ్చెన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినందుకే తమ అధినేత చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. మద్యపాన నిషేధమన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట తప్పి రూ.వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రంలో 40 వేల ఎకరాలను అడ్డగోలుగా దోపీడీ చేశారు. ప్రజలకు అన్ని విషయాలు చెబుతున్నారనే చంద్రబాబును అరెస్టు చేశారు.
నీటి పారుదల వ్యవస్థను జగన్ ఎలా నాశనం చేశారో చంద్రబాబు చెప్పారు. దీంతో స్కిల్ కేసులో ఆధారాలు లేకుండా ఆయనను అరెస్టు చేశారు. లేని, వేయని ఇన్నర్ రింగ్‌రోడ్డులో అవినీతి ఎలా జరిగిందో జగన్ సమాధానం చెప్పాలి. 160 స్థానాలు కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఏ ఒక్కరూ గెలవరు అని ధీమా వ్యక్తం చేశారు.













