ఏపీలో కరోనాఉధృతి.. 2 లక్షలు దాటిన

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 96,446 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,399 మందికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 13,66,785 మంది వైరస్ సోకింది. రాష్ట్రంలో నేటి వరకు 1,77,02,133 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 24 గంటల్లో 18,638 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 11,56,666 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,01,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గత 24 గంటల్లో విశాఖపట్నంలో 11 మంది, విజయనగరంలో 11 మంది, చిత్తూరులో తొమ్మిది మంది, కర్నూలులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, కృష్ణలో ఎనిమిది మంది, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఐదుగురు, కడపలో నలుగురు, ప్రకాశంలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, అనంతపురంలో ముగ్గురు కరోనాతో మరణించారు. కొవిడ్‍తో నిన్న ఒక్కరోజే 89 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 9,077కి చేరింది.