ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 16వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 84,224 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 16,167 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,43,557కు చేరింది. రాష్ట్రంలో 21,385 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 14,46,244 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,86,728 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో 104 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది మృతి చెందారు. పశ్చిమగోదావరి 13, విశాఖపట్నం 11 మంది మృతి చెందారు. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. గుంటూరు, విజయనగరం జిల్లాలో 8 మంది చొప్పున మృతి చెందారు. ప్రకాశం 7, తూర్పుగోదావరి 6, కృష్ణా 6, కర్నూలు 6, శ్రీకాకుళం 6, కడపలో ఒకరు కన్నుమూశారు. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 10,531కి మంది మృతి చెందారు.