ఏపీలో కొత్తగా 14,986 కేసులు.. 84 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14 వేల మంది కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 60,124 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 14,986 మంది పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. కరోనాతో 84 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 8,791కు చేరింది. గడిచిన 24 గంటల్లో 16,167 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,74,28,059 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,89,367 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరిలో 2,352 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరిలో 423 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా వల్ల పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో 12 మంది, తూర్పుగోదావరి 10 మంది, విశాఖ 9, నెల్లూరు 8, విజయనగరం 8 మంది, చిత్తూరు 6 మంది, కర్నూలు 6, కృష్ణా 4, శ్రీకాకుళం 4, అనంతపురం 3, కడపలో ఇద్దరు మృతువాతపడ్డారు.