దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేత …
దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేతకు ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు. కరోనా తీవ్రత లేని ప్రాంతాల్లో మెల్లగా కార్యాలయాలను తెరిచేందుకు మెరుగైన ప్రణాళికను రచించాలని ఆయన కేంద్రమంత్రులకు సూచించారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత దృష్టిసారించిన 10 ప్రాధాన్యతా అంశాలను రూపొందించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కరోనా తీవ్రతను తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపతికన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే వాణిజ్యం కొనసాగింపు ప్రణాళికను రూపొందించాలని కోరారు.













