15వ భారత ప్రధానిగా మోదీ ప్రమాణం
భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఎనిమిదివేల మంది ఆహుతులు, దేశ విదేశీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నరేంద్రమోదీతో పాటు మంత్రి వర్గ సహచరులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 68 సంవత్సరాలు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీయే చైర్ పర్సన్ సోనియాగాంధీ, కార్పొరేట్ దిగ్గజాలు, సినిమా తారలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిమ్సెక్ట్ దేశాధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు, మేదావులు, కళాకారులు, సాహితీవేత్తలు, ఆధ్మాత్మిక గురువు హాజరయ్యారు.













