ఇక లాభంలేదు.. ఆ శిక్షలు మొదలుపెట్టాలి
దేశంలో రోజుకు రోజుకూ మహిళలపై పెరిగిపోతున్న దురాగతాలపై గోవా మంత్రి మైఖేల్ లోబో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ మృగాలకు చెక్ పెట్టాలంటే బహిరంగ ఉరిశిక్షలు అమలు చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. దిశ హత్యకేసులో నిందితుల ఎన్కౌంటర్, ఉన్నావ్ బాధితురాలి మృతి నేపథ్యంలో లోబో మీడియాతో మాట్లాడుతూ కత్తులు, గన్నులతో బెదిరించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం.. తర్వాత వారిని చంపి తగలబెట్టడం అనేది ఊహించడానికి కూడా కష్టం ఉంది. ఇలాంటి దుర్మార్గులను చట్టపరంగా కఠినంగా శిక్షించాల్సిందే. మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారిని బహిరంగంగా ఉరితీయయం మొదలుపెట్టాలి అని పేర్కొన్నారు.













