హెచ్ డీ దేవెగౌడకు మరో గౌరవం
మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ కురువృద్ధుడు హెచ్డీ దేవెగౌడకు మరో గౌరవం దక్కింది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం చేసిన సేవలకు గుర్తింపుగా, ఆయన మహర్షి వాల్మీకి జయంతి అవార్డు అందుకోనున్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా విధాన సౌధలో జరిగే ఓ కార్యక్రమంలో తన కుమారుడు, కర్ణాటక సీఎం కుమారస్వామి చేతుల మీదుగా దేవెగౌడ ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. అయితే ఆయన విదేశీ పర్యటనకు ముందుగానే షెడ్యూల్ ఖరారు కావడంతో ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. తాను లండన్ బయల్దేరే ముందే మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేయనున్నట్లు దేవెగౌడ వెల్లడించారు. 1933 మే 18న జన్మించిన దేవెగౌడ, 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. దీనికి ముందు 1994 నుంచి 1996 వరకు కర్ణాటక 14వ ముఖ్యమంత్రిగా కొనసాగారు.













