లోక్ సభ వాయిదా
పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గందరగోళం మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఫ్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఎంపీల నిరసనలతో సభను చైర్మన్ రెండు గంటల వరకు వాయిదా వేశారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డుల ప్రదర్శనతో నిరసనలు తెలిపారు. కేంద్రం దిగొచ్చి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.













