ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. సత్ఫలితాలు

కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇండియాలో పాజిటివిటీ రేటు తగ్గిందన్నారు. 85 శాతం కరోనా కేసులు 10 రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని తెలిపారు. 11 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, మరో 8 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు. 24 రాష్ట్రాల్లో 15 శాతానికి మించి పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు. గత వారం దేశంలో పాజిటివిటీ రేటు 21.9 శాతం ఉందని, అయితే ఇప్పుడు ఆ రేటు 19.8 శాతానికి తగ్గినట్లు తెలిపారు. ఢిల్లీ, చత్తీస్‍ఘడ్, డమన్ అండ్ డయూ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో వైరస్ పాజిటివిటీ రేటు తగ్గిందని ఆయన తెలిపారు. జాతీయ రికవరీ రేటు సైతం 83.83 శాతానికి పెరిగిందన్నారు.