కాంగ్రెస్ లో చేరిన మాజీ క్రికెటర్
మాజీ బీజేపీ నాయకుడు, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆజాద్‌కు రాహుల్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరని కీర్తి ఆజాద్‌ను భారతీయ జనతా పార్టీ 2015లో బహిష్కరించింది. వచ్చే ఎన్నికల్లో బీహార్‌లోని దర్భంగా నియోజకవర్గం నుంచి కీర్తి ఆజాద్ పోటీ చేయనున్నారు. డీడీసీఏ కుంభకోణంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి సంబంధం ఉందని ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా మద్దతు పలకడంతోనే 2015లో కీర్తి ఆజాద్‌ను బీజేపీ నుంచి బహీష్కరించిన సంగతి తెలిసిందే.













